పెళ్లైన వారానికే, ముగ్గురి పిల్లలతో సహా భార్యభర్తలు ఆత్మహత్య!

by Anjali |
పెళ్లైన వారానికే, ముగ్గురి పిల్లలతో సహా భార్యభర్తలు ఆత్మహత్య!
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లైన వారం రోజులకే, ముగ్గురు పిల్లతో సహా దంపలిద్దరూ కూడా సూసైడ్ చేసుకున్న ఘోరమైన ఘటన కేరళలోని కన్నూర్ మండంలోని చెరుపుజ పాటిచల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. షాజీ, శ్రీజ అనే దంపలిద్దరూ గత వారం 16(మే) న వివాహం చేసుకొన్నారు. శ్రీజకు మొదటి పెళ్లి ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు చనిపోగా.. ఒక పాప ఆమెతోనే ఉంటుంది. అలాగే షాజీకి మాజీ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా బుధవారం ఉదయం తమ ఇంట్లో పిల్లలు మరణించి కింద పడి ఉన్నారు. భర్యభర్తలిద్దరూ సీలింగ్ ఫ్యాన్‌కు ఊరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మొదట పిల్లలను చంపిన తర్వాత వారిద్దరూ ఊరేసుకుని ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రే జరిగిందని, కానీ ఈ రోజు(మే 24)న వెలుగు చూడడంతో ఆ ప్రాంత వాసులు పోలీసులను అప్రమత్తం చేశారని సీనియర్ పోలీసు ఆఫీసర్ తెలిపారు.

Advertisement

Next Story