- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతరకు వెళ్లి వస్తుండగా.. భర్త ముందే గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం..
దిశ, వెబ్ డెస్క్: సమాజంలో అమ్మాయిలకు రక్షణ కరువైంది. అమ్మాయిలు బయటకు వెళితే చాలు కొంత మంది కామాంధులు దారుణంగా ప్రవర్తిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. దీంతో అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. తాజాగా, జార్ఖండ్‌లోని బోరియో జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత భర్తతో జాతరకు వెళ్లి వస్తుండగా కొంత మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని బోరియో జిల్లాలో ఓ దంపతులు జాతరకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది వారిని అడ్డుకుని మహిళను పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. భార్యను రక్షించుకునేందుకు భర్త అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై దాడి చేశారు. చివరకు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. వారి నుంచి బాధితురాలు తప్పించుకుని నగ్నంగా గ్రామానికి చేరుకుంది. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.