- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
దిశ, నేరడిగొండ : ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా రాచనపల్లిలోని రత్న డిపెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటుండగా చిత్తూరు జిల్లా చౌడిపల్లి గ్రామానికి చెందిన కుంచి కళ్యాణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే ఆ వ్యక్తి బాధితుడితో నీకు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం ఇప్పిస్తానని, తనకు బెంగళూరులో అధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు.
దీంతో బాధితుడు కుంచి కళ్యాణ్‌కు రూ.13 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే బాధితుడు కళ్యాణ్‌కు నగదు రూపంలో, ఫోన్ పే ద్వారా ఒక సంవత్సం పాటు సుమారు. రూ.5 లక్షల 88 వేల 526 చెల్లించాడు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితుడు 10.10.2022 రోజున నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కళ్యాణ్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. జిల్లా ఎస్పీ గౌస్ అలాం ఆదేశాల మేరకు ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్. నాగేందర్ పర్యవేక్షణలో ఇచ్చోడ సీఐ భీమేష్ ఆధ్వర్యంలో నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్, సిబ్బందితో కలిసి ఒక టీముగా ఏర్పడి మంగళవారం ఆదిలాబాద్ వద్ద నిందితుడైన కుంచి లక్ష్మణ్‌ను చాకచక్యంగా పట్టుకొని అతని వద్ద నుండి రూ. 2 లక్షల ఒక వేయి రూపాయలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ పీమేష్, ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ గౌస్ అలామ్ అభినందించారు.