కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, ఇంద్రవెల్లి : కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రబుద్దనగర్ లో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రబుద్దనగర్ కాలనీకి చెందిన వాగ్మారే క్రాంతి కుమార్ (36) మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలోని మల్టీ పర్పస్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబం సభ్యులు పలు ఆసుపత్రులలో వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కడుపునొప్పి భరించలేక గురువారం తెల్లవరుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ దుబ్బాక సునీల్ ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. భార్య కాంతాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed