- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు పిల్లలతో బావిలో దూకిన తల్లి.. ప్రాణాల కోసం ప్రయత్నం..ఏం జరిగిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: భర్తతో గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వివాహిత మహిళ తన నాలుగురి పిల్లలతోపాటు బావిలో దూకిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుర్హన్‌పూర్ జిల్లాకు 60 కిలో మీటర్ల దూరంలోని బాల్ది గ్రామంలో ప్రమీల భిలాలా (30) భర్త రమేశ్‌తో కలిసి జీవిస్తున్నది. వారికి నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడ పిల్లలు, ఒక అబ్బాయి. భార్యభర్తల మధ్య తగాదం కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే క్షణికావేశానికి లోనై... తాను కాకుండా తమ పిల్లల్ని కూడా వెంట తీసుకెళ్లాలని అనుకుంది.
ప్రమీల ఇంటికి సమీపంలోని బావి వద్దకు తమ నలుగురి పిల్లల్ని తీసుకెళ్లింది. ముందుగా పిల్లలను బావిలో తోసేసి.. ఆ తర్వాత ప్రమీల కూడా అదే బావిలో దూకింది. నీటిలో మునిగిపోతుండగా మళ్లీ ఎలాగైనా బతకాలని ఆశతో ఆ బావిలో లోతుగా వేలాడుతున్న ఓ తాడును అందుకుంది. పెద్ద కూమార్తెను పట్టుకుని తాడు సహాయంతో ఆమె బయటకు వచ్చేసింది. కానీ మూడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కూమార్తెలను అలాగే 18 నెలల కుమారుడుని బావిలోనే వదిలిపెట్టింది. ముగ్గురు పిల్లలు ఆ బావిలోనే విగతజీవులయ్యారు. ‘బావిలో నుంచి ముగ్గురి డెడ్ బాడీలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం పంపించాం. ఈ ఘటనకు సంబంధించి కేసు ఫైల్ చేశామని, ప్రస్తుతం ప్రమీల భిలాలా, ఆమె ఏడేళ్ల పెద్ద కుమార్తె ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఎస్పీ రాహుల్ కుమార్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి రేపుతోంది.