కుషాయిగూడలో దారుణం.. కన్న బిడ్డ ఉసురు తీసిన కసాయి తల్లి

by Javid Pasha |   ( Updated:2022-12-19 16:53:35.0  )
కుషాయిగూడలో దారుణం.. కన్న బిడ్డ ఉసురు తీసిన కసాయి తల్లి
X

దిశ, కాప్రా: కన్నపేగు బంధాన్నే మరచిన కసాయి తల్లి పురుట్లోనే శిశువు ఉసురు తీయడానికి తెగించింది. పొత్తిళ్లలో ఒదగాల్సిన నవజాత శిశువు రోడ్డు మీద విసిరేసింది. మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచిన ఈ ఉదంతం కుషాయిగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ కాలనీలోని ఓ అపార్టుమెంటులోకి ఓ గుర్తుతెలియని మహిళ శివువును విసిరేసి వెళ్లింది. ఇది గమనించిన అపార్టుమెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై సాయికుమార్ హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని శిశువును అక్కున చేర్చుకుని చికిత్స నిమిత్తం 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.


కాగా ఆసుపత్రిలో తీవ్ర గాయాలపాలైన శిశువు దాదాపు 5 గంటలపాటు మృత్యువుతో పోరాడి అసువులుబాసింది. విషయాన్ని తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మీ పెర్మల్ సోమవారం సంఘటనా స్థలానికి చేరకుని పరిసరాలను పరిశీలించిన స్థానికుల నుంచి వివరాలు సేకరించించారు. సీసీ కెమారాలను క్షుణ్నంగా పరిశీలించి కసాయి తల్లి వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు.

Advertisement

Next Story

Most Viewed