ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య.. కారణం అదే..

by Sumithra |
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య.. కారణం అదే..
X

దిశ, నవీపేట్ : మండల కేంద్రానికి చెందిన ఎర్ర కావ్య బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గురువారం ఉదయం నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ వినాయక్ నగర్ కు చెందిన కావ్యతో ఏడాదిన్నర క్రితం మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యెర్ర మనోజ్ కు వివాహం జరిగిందన్నారు. కాగా మనోజ్ కు ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఎప్పుడు గొడవలు జరిగేవని తెలిపారు.

ఈ నేపధ్యంలోనే గతంలో రెండు మూడు సార్లు పెద్దమనుషులతో మాట్లాడారని తెలిపారు. అయినా మనోజ్ తీరు మారలేదని, అతను చేసిన అప్పులు పెరగడంతో అదనపువరకట్నం కోసం వేధించేవారని తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య బుధవారం రాత్రి బెడ్ రూమ్ లోని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్యాహత్య చేసుకుందని తెలిపారు. కావ్య తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త మనోజ్, మామ మహేష్, అత్త అరుణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఏసీపీ వెంట తహసీల్దార్ వీర్ సింగ్, సీఐలు రాజారెడ్డి లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Next Story