- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడిసెలో ఎగిసిపడిన మంటలు
రూ.4లక్షల మేర ఆస్తి నష్టం
దిశ, కమ్మర్ పల్లి : గుర్తుతెలియని దుండగులు నిప్పంటించడంతో పూరిగుడిసె దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమ్మర్ పల్లి మండలం కొనసముందర్ గ్రామానికి చెందిన కట్ట రాజన్న వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటికి దగ్గర్లో ఉన్న గుడిసెలో వ్యవసాయానికి కావాల్సిన సామాగ్రి, నిత్యావసర వస్తువులు, బైకు, సైకిళ్లను రోజూ అందులో పెట్టేవాడు. గురువారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు పూరి గుడిసెకి నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గుడిసెలో ఉన్న ఒక బైక్ తో సహా రెండు సైకిళ్లు, గడ్డి, సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విషయం తెల్సుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు కట్ట రాజన్న తెలిపారు. తాను ఓ సన్నకారు రైతునని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు.