HYD: హిమాయత్‌ సాగర్‌ సర్వీస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

by GSrikanth |
HYD: హిమాయత్‌ సాగర్‌ సర్వీస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు జార్ఖండ్‌కు చెందిన జితేందర్ కుమార్, కేదారేశ్వర్ గౌడ్‌గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story