పదిలో పాస్ అయినందుకు ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్స్.. ఊహించని పరిణామంతో అంతా షాక్

by Javid Pasha |   ( Updated:2023-07-29 10:54:45.0  )
పదిలో పాస్ అయినందుకు ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్స్.. ఊహించని పరిణామంతో అంతా షాక్
X

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతిలో పాసయ్యాననే ఆనందంలో ఓ విద్యార్థి తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని ఖేడాలో మోహిత్ కుమార్ కేదార్ ప్రసాద్ (17) అనే విద్యార్తి పదో తరగతిలో పాసయ్యాడు. ఈ నేపథ్యంలోనే తన ఫ్రెండ్స్ జైసావల్ ప్రాంజల్ అజయ్‌భాయ్ (16), సచిన్ జసాంగ్‌భాయ్ అనే తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సమీపంలోని కాలువ వద్దకు స్నానానికి వెళ్లారు. మొదట చిన్న కాలువలో దిగి స్నానం చేసిన వాళ్లు.. తర్వాత పెద్ద కాలువలోకి వెళ్లారు. అయితే వరద నీటి ఉధృత ఎక్కువగా ఉండటంతో సచిన్ పెద్ద కాలువలోకి వెళ్లలేదు.

ఇక పెద్ద కాల్వలోకి వెళ్లిన మోహిత్, జసవాల్ ప్రాంజల్ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. మిస్సింగ్ అయిన వాళ్ల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన పోలీసులు దాదాపు 5 గంటల శ్రమ తర్వాత మృతదేహాలను వెలికి తీశారు. ప్రత్యక్ష సాక్షి, మృతుల ఫ్రెండ్ సచిన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story