దారుణం.. మద్యం మత్తులో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-05 11:45:39.0  )
దారుణం.. మద్యం మత్తులో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కథలో విషాదం మిగిలింది. ప్రియుడు మద్యం మత్తులో ప్రియురాలిని దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం రామలింగాపురం ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. పుట్టుకతో మూగ ఉన్న కాటమ్మ భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన చెంచయ్యతో ప్రేమాయణం కొనసాగించింది. ఓ రైతు వద్ద ఇద్దరు కూలీ పనిచేస్తూ సహ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(శుక్రవారం) రాత్రి మద్యం మత్తులో కాటమ్మను చెంచయ్య కర్రతో తలపై కొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెంచయ్యను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో చెంచయ్య.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మత్తులో చేసినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed