మెసేజ్‌లకు రిప్లై ఇవ్వనందుకు దారుణం.. ముగ్గురు యువకులు కలిసి..

by Javid Pasha |   ( Updated:2022-08-27 09:45:05.0  )
మెసేజ్‌లకు రిప్లై ఇవ్వనందుకు దారుణం.. ముగ్గురు యువకులు కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా ఇదే తరహా ఘటన ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో మెసేజ్‌లకు రిప్లై ఇవ్వట్లేదన్న నెపంతో 16 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు బాబి, పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించడంతో హత్య ప్లాన్ మొత్తం అర్మాన్ అలీ అనే యువకుడు చేశాడని తెలిపారని పోలీసులు చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం అర్మాన్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. 'అర్మాన్ అలీకి బాధితురాలితో సోషల్ మీడియాలో పరిచయం అయింది. వారు సోషల్ మీడియోలో రెండు సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే 6 నెలల క్రితం బాధితురాలు ఒక్కసారిగా అర్మాన్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ఆపేసింది. దాంతో కోపోద్రిక్తుడైన అర్మాన్ యువతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడని నిందితులు వెల్లడించారు' అని పోలీసులు తెలిపారు.

నిందుతులు తమ ప్లాన్ ప్రకారం గురువారం బాధితురాలు స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా నిందితులు దాడి చేశారని, వారి మధ్య వాగ్వాదంలో బాధితురాలి భుజానికి దెబ్బతగిలిందని, అదంతా కోపంలో జరిగిపోయిందని వారు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో నిందుతులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : జయలలిత మృతిపై రిపోర్టు .. 600 పేజీలు.. 150 మందిని విచారణ

Advertisement

Next Story