మద్యం మత్తులో లొల్లి.. ఒకరు మృతి

by srinivas |   ( Updated:2020-07-02 00:44:08.0  )
మద్యం మత్తులో లొల్లి.. ఒకరు మృతి
X

దిశ, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో ఘర్షణ పడి ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన నరసరావుపేటలో చేటు చేసుకుంది. నరసరావుపేట లలితా దేవి కాలనీలో మద్యం మత్తులో బలుసుపాటి వీరాoజనేయులు, సాయి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సాయి.. వీరాంజనేయులుడిని కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Next Story