క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్టు కోల్పోయిన ‘ఖవాజా’

by Shiva |
క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్టు కోల్పోయిన ‘ఖవాజా’
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) 2020-21 సీజన్‌కు గాను పురుష, మహిళా క్రికెటర్ల కాంట్రాక్టు జాబితాను ప్రకటించింది. 20 మంది క్రికెటర్లతో కూడిన పురుషుల క్రికెట్ జాబితా నుంచి ఉస్మాన్ ఖవాజా పేరును తొలగించింది. వరుసగా ఐదేండ్లు కాంట్రాక్టు పొందిన ఖవాజాను సీఏ ఈ సీజన్‌కు పక్కన పెట్టింది. కాగా, కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న మార్నస్ లబుషేనే, మిచెల్ మార్ష్‌లకు జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌కు ప్రకటించిన ఆటగాళ్లలో మొత్తం ఆరుగురు కొత్త ఆటగాళ్లకు కాంట్రాక్టు ఇచ్చారు.

ఇక మహిళా క్రికెట్ జట్టు కోసం 15 మంది పేర్లను ప్రకటించారు. ఇటీవల పూర్తి కాంట్రాక్టును దక్కించుకున్న ఎరిన్ బర్న్స్, టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న మోలీ స్ట్రానోలకు కాంట్రాక్టు దక్కకపోవడం గమనార్హం. కాగా, వీరిద్దరినీ ‘భవిష్యత్ ప్రణాళిక జట్టు’ కింద వెయిటింగ్‌లో ఉంచారు. పురుష, మహిళా జట్టులో కాంట్రాక్టు దక్కని ఆటగాళ్లు నిరాశకు గురి కావద్దని.. వారికి కాంట్రాక్టు లభించకపోయినా జాతీయ జట్టులో అవకాశాలు వస్తాయని సెలెక్టర్లు చెప్పారు.

Tags : Cricket Australia, New Season, Contract Players, Usman Khawaja, Cricket, Women’s Team, Men’s Team

Advertisement

Next Story