ఆ చట్టంలో లోపాలు సవరించాలి

by Shyam |
ఆ చట్టంలో లోపాలు సవరించాలి
X

దిశవెబ్ డెస్క్:
నూతన రెవెన్యూ చట్టంపై సీపీఐ(ఎం)నేత తమ్మినేని వీరభద్రం స్పందించారు. ఈ చట్టాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ…రెవెన్యూ చట్టంలో లోపాలు ఉన్నాయని అన్నారు. వాటిని సరిదిద్దాలన్నారు. నూతన చట్టంతో కౌలు రైతులు తమ హక్కులను కోల్పోతున్నారని చెప్పారు. అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను, వక్ప్ భూములు, మిగుల అటవీ భూములను తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story