సీపీఎల్ షెడ్యూల్ విడుదల

by Shyam |
సీపీఎల్ షెడ్యూల్ విడుదల
X

దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పూర్తి షెడ్యూల్‌ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 18న తొలి మ్యాచ్ జరగ్గా సెప్టెంబర్ 10న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. బయో సెక్యూర్ వాతావరణంలో రెండు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకోసం ట్రినిడాడ్, టొబాగోలోని అంతర్జాతీయ స్టేడియాలను వినియోగించనున్నారు. ఆగస్టు 18న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తరుబాలోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో సెమీ ఫైనల్, ఫైనల్‌ సహా 23 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్ పార్క్ ఓవల్ స్టేడియం‌లో మిగిలిన 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు స్టేడియాలకే మ్యాచ్‌లు పరిమితమైనా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తామని సీపీఎల్ సీఈఓ డామీన్ డోనోహోయ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story