నయా పైసా ఉపయోగం లేదని..

by srinivas |
నయా పైసా ఉపయోగం లేదని..
X

దిశ, అమరావతి బ్యూరో: కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి దేశాన్ని అమ్మేందుకు సిద్ధమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దివాలాకోరు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు శుక్రవారం తెలిపే నిరసనలకు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 151 పాసింజర్ రైళ్ల నిర్వహణను బీజేపీ ప్రైవేటు పరం చేస్తుందని మండిపడ్డారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు తీసిందని దుయ్యబట్టారు. రక్షణ రంగంలో 75 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించిందని, ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చూస్తోందని విమర్శించారు. పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికుల కష్టాలు ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడంలేదని అన్నారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల పేదలకు నయా పైసా ఉపయోగం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకెళ్లేసి దుర్మార్గంగా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న కేంద్రం తీరును ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed