గౌరవెల్లి రైతుల పోరాటానికి సీపీఐ మద్దతు : చాడ

by Shyam |
గౌరవెల్లి రైతుల పోరాటానికి సీపీఐ మద్దతు : చాడ
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న రైతులకు సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 15రోజుల పాటు ప్రాజెక్టు పనులు వెంటనే నిలిపివేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, జిల్లా కలెక్టర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖలు రాశారు.

Advertisement

Next Story

Most Viewed