ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం సాగుతోంది: చాడ

by Shyam |
ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం సాగుతోంది: చాడ
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో రోజుకు 2వేల కరోనా కేసులు వస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం కొత్త భవనాల కోసం ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ సీపీఐ కార్యాలయంలో శనివారం చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన అఖిపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల మీద ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో వారి ఇష్టారాజ్యం సాగుతుందన్నారు. తెలంగాణ బడ్జెట్‌లో కేవలం 0.8 శాతం మాత్రమే వైద్యంపై ఖర్చు చేస్తున్నారని , ‌ఉద్యోగ, ఉపాధి, హక్కుల ఉల్లంఘనపై తలచుకుంటేనే మన తెలంగాణ ఇదా అనే ఆవేదన కలుగుతుందన్నారు. ఇవేవీ పట్టని కేసీఆర్ సెక్రటేరియట్‌కు మాత్రం రూ.560 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed