- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం : సీపీ స్టీఫెన్ రవీంద్ర
దిశ, శేరిలింగంపల్లి : మాదకద్రవ్యాల సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబరాబాద్ సీపీ ఎం. స్టీఫెన్ రవీంద్ర. గురువారం డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లతో సీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ 1985 పై సిబ్బంది మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. డ్రగ్స్ నెట్వర్క్, డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఇటీవల కాలంలో యువత డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు.
గంజాయి వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించి దృష్టి సారించాలన్నారు. సప్లయర్స్ చైన్ ను బ్రేక్ చేస్తే మత్తులో జరిగే నేరాలను అడ్డు కట్ట వేసే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎం విజయ్ కుమార్, క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, బాలానగర్ డీసీపీ పీవీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.