పౌరుల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలి: సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

by Shyam |   ( Updated:2021-12-03 11:41:38.0  )
పౌరుల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలి: సీపీ స్టీఫెన్‌ రవీంద్ర
X

దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలోని 254 మంది పోలీసు సిబ్బందికి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అవార్డులు ప్రదానం చేశారు. రిసెప్షన్, బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్, సెక్షన్ ఇంచార్జ్‌లు, ఇన్వెస్టిగేషన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, డీఐ, డీఎస్ ఐ, సెక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, క్రైమ్ రైటర్స్ కు అన్ని ఫంక్షనల్ వర్టికల్స్‌లో అత్యుత్తమ పనితీరుకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహిస్తేనే సమాజానికి సేవ అందించే నాణ్యత పెరుగుతుందని అన్నారు. పౌరుల ఫిర్యాదులకు తక్షణ ప్రతిస్పందన అవసరమని తెలిపారు.

పౌరులకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల వారికి ఆపద సమయంలో అత్యుత్తమ నాణ్యమైన సేవలను అందించడానికి, ఏడాది పొడవునా నిరంతరం సేవలు అందించేందుకు ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story