సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ సెల్: సైబరాబాద్ సీపీ

by Shyam |
సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ సెల్: సైబరాబాద్ సీపీ
X

దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో గురువారం కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర గ్రీవెన్స్ సెల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 12 గ్రీవెన్స్ సెల్ సమావేశాలు నిర్వహించామని, సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. ముఖ్యంగా హెచ్ఆర్ఎమ్ఎస్, సినిమాటోగ్రఫీ పర్మిషన్లు, ఈవెంట్ పర్మిషన్లు, పెట్రోలియం పర్మిషన్లు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. హెచ్ఆర్ఎమ్ఎస్ అప్లికేషన్ వినియోగంపై సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు. ఏఆర్ పోలీసు సిబ్బంది గార్డులను పెంచి వారి పనిభారాన్ని తగ్గించాలన్నారు.

సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్ (83339 93272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ అనసూయ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, సీఎస్ డబ్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏడీసీపీ శంకర్, ఏసీపీలు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story