వైద్య బృందాలకు నా సెల్యూట్

by Shyam |
వైద్య బృందాలకు నా సెల్యూట్
X

దిశ, హైదరాబాద్: వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది చేస్తున్న సేవలకు నా సెల్యూట్ అంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ అంజనీ కుమార్ కొనియాడారు. ప్రస్తుత కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.

బుధవారం ఆయన హైదరాబాద్ జిల్లా ఆస్పత్రి కింగ్ కోఠికి వెళ్లి వైద్యులు, సిబ్బంది సేవలను కొనియాడుతూ పూలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత ఛాలెంజింగ్ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ వైద్యులకు సహకరించాలని ప్రజలను కోరారు. లాక్ డౌన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యుద్ధం లాంటి పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వైద్యులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Tags: CP Anjanee kumar, Hyderabad, Doctors, nurses, King koti hospital

Advertisement

Next Story

Most Viewed