- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టుబడిన రూ. కోటి బీజేపీదే : సీపీ అంజనీకుమార్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ప్లై ఓవర్ సమీపంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ. కోటి నగదు పట్టుకోవడంతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నిక కోసం ఆ డబ్బును తరలిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రూ.కోటి నగదు బీజేపీ పార్టీకి చెందినదిగా గుర్తించినట్లు సీపీ వెల్లడించారు.
దుబ్బాకలో నేటితో ప్రచారం ముగుస్తున్న క్రమంలో నిఘాను పటిష్టం చేశామని, అందులో భాగంగానే భారీ ఎత్తున డబ్బు దొరికిందన్నారు. ఆదివారం మధ్నాహ్నం టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన డబ్బు రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాస్ రావుకు చెందినదిగా తేలిందన్నారు. కారు డ్రైవర్ టి. రవికుమార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సీపీ తెలిపారు. అంతేకాకుండా, డబ్బు తరలిస్తున్న ఇన్నోవా వాహనం, రెండు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, సెల్ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయని సీపీ అంజనీకుమార్ వివరించారు.