- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భయంకరమైన ముఠా అరెస్ట్…
భయంకరమైన అంతరాష్ట్ర చోరీ ముఠాను నగరంలోని వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రం మధుబని జిల్లాకు చెందిన ఆరుగురు సభ్యుల చోరీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో వివరాలు వెల్లడించారు. ముఠా నాయకుడు రమాషిష్ ముఖియా అలియాస్ కరణ్, సభ్యులు భగవత్ ముఖియా(32), భోలా ముఖియా(35), హరిషాచంద్ర ముఖియాలను అరెస్ట్ చేయగా రాహుల్ ముఖియా, పితాంబర్ మండలం పరారీలో ఉన్నట్టుగా సీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరంతా రెక్కీ నిర్వహించి చోరీ చేసేందుకు ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటారని, అనంతరం ఇండ్లలో పనివాళ్లుగా చేరి చోరీలు చేస్తుంటారన్నారు. వీరిలో గ్రూప్‌ను లీడ్ చేసే భగవత్ ముఖియా ఏజెన్సీ ద్వారా వంటవాటిగా లేదా ఇంటి ఇతర పనుల్లో సేవకుడిగా చేరతాడు. అనంతరం ఆ చుట్టుప్రక్కల ఇండ్లలో తన గ్రూప్ సభ్యులను పనికి కుదురుస్తాడు. ఇలా పనిచేస్తూ ఆయా ఇళ్లలో ఉండే నగలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసి పారిపోయేవాళ్లు అని వెల్లడించారు.