తెలంగాణలో వింత.. కవలలకు జన్మనిచ్చిన గోమాత

by Sridhar Babu |   ( Updated:2021-11-06 02:41:16.0  )
తెలంగాణలో వింత.. కవలలకు జన్మనిచ్చిన గోమాత
X

దిశ, మంథని : సాధారణంగా ఆవు కాన్పులో ఒకసారి ఒక దూడకు జన్మనివ్వడం సహజం. కానీ కవలలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది. స్థానిక రావుల చెరువుకట్టకు చెందిన పాపిట్ల సంతోష్ పెంచుకునే గోమాత శుక్రవారం రాత్రి ఒకే ఈతలో కవల దూడలకు జన్మనిచ్చింది. రెండూ దూడలు ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో సంతోష్ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో సైతం ఇదే విధంగా కవల పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. వీటికి గణేశ్, గంగగా నామకరణం చేశారు.

Advertisement
Next Story