వైజాగ్‌ను కలవపరస్తున్న కరోనా.. 34 మంది మృతి

by Anukaran |   ( Updated:2020-07-19 02:45:42.0  )
వైజాగ్‌ను కలవపరస్తున్న కరోనా.. 34 మంది మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ వాసులను కరోనా మరణాలు భయపెడుతున్నాయి. విశాఖపట్టణం జిల్లాలో ఇప్పటి వరకు 1832 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా నగరంలో కరోనా వైరస్ విజృంభణ ఆందోళనకరంగా మారింది. మరోవైపు విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 47 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 34 మంది గత 8 రోజుల్లోనే మృతి చెందడం వైజాగ్ వాసులను కలవరపరుస్తోంది.

విశాఖపట్టణంలో మే 1న తొలి మరణం నమోదైంది. ఆ తరువాత పెద్గా మరణాలు సంభవించలేదు. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో విశాఖ వాసులు కాస్త స్థిమితపడ్డారు. అయితే ఊహించని విధంగా గత వారం రోజుల్లో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నెల 11న ఏడుగురు మృతి చెందగా, 12న ముగ్గురు, 13న నలుగురు, 14న ఆరుగురు, 15న ఐదుగురు, 16న ఆరుగురు, 17న ఒకరు చనిపోగా, నిన్న ఇద్దరు మృతి చెందారు. దీంతో వైజాగ్‌లో కరోనా మృతుల సంఖ్య 47కి చేరుకుంది.

ప్రాంతీయ (రీజనల్) కొవిడ్ ఆస్పత్రి విమ్స్‌లోనూ మరణాలు పెరుగుతున్నాయి. ఇందులో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పాజిటివ్ రోగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందినవారిలో ఈ నెల 17 వరకు 295 మంది డిశ్చార్జ్ కాగా, 62 మంది మృతి చెందారు. 179 మందికి ఇంకా చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed