- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 9.5 శాతమే : ఫిచ్ సొల్యూషన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గిన పరిణామాలు చూసి భారత జీడీపీ వృద్ధిపై భారీ అంచనాలను ప్రకటించిన రేటింగ్ ఏజెన్సీలు ఇప్పుడు తగ్గించే పనిలో పడ్డాయి. ఇప్పటికే పలు సంస్థలు అంచనాలను సవరించగా, తాజాగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ వృద్ధి రేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. కొవిడ్ సెకెండ్ వేవ్ భారత ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది. గతేడాది మొదలైన కరోనా ప్రభావం నుంచి పునరుద్ధరణ సాధిస్తున్న భారత్‌కు ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఫిచ్ తెలిపింది.
ఈ క్రమంలో కరోనా నియంత్రణకు అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షల వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండొచ్చని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఇదివరకు మార్చి నెలలో దేశ వృద్ధి రేటును 12.8 శాతంగా ఫిచ్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎప్పటికప్పుడు పెరుగుతున్న కారణంగా వృద్ధి రేటును తగ్గిస్తున్నామని ఫిచ్ సొల్యూషన్స్ వివరించింది. కొనసాగుతున్న ఆర్థిక పునరుద్ధరణపై ఆధారపడి ప్రస్తుత నియంత్రణ చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గతేడాది విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రభావం కంటే ఈసారి తక్కువ ప్రభావం ఉండొచ్చని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది.