ప్రారంభమైన ‘కొవిడ్-19 ఎసెన్షియల్ స్టోర్’

by Harish |
ప్రారంభమైన ‘కొవిడ్-19 ఎసెన్షియల్ స్టోర్’
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్‌ను నిరోధించేందుకు మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు, గ్లౌజులు వాడుతున్నారు. అయితే.. ఇందులో కొన్ని మాత్రం మెడికల్ షాపుల్లో దొరుకుతుండగా.. మరికొన్నింటి కోసం వేరే చోటుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా.. కరోనా కట్టడికి కావాల్సిన వస్తువులన్నీఒకే చోట దొరికేలా.. ఫ్లోరిడా, మియామీలోని ఎవెంచురా షాపింగ్ మాల్‌లో ‘కొవిడ్-19 ఎసెన్షియల్స్’ స్టోర్ ఒకటి ఇటీవలే ప్రారంభమైంది.

కొవిడ్‌ను నిరోధించడానికి వాడే.. విభిన్న రకాల మాస్క్‌లు, డిస్‌ఇన్‌ఫెక్టర్స్, ఫేస్ షీల్డ్స్, శానిటైజర్లు, లిక్విడ్ వాష్‌లు, కాంటాక్ట్‌లెస్ ఎసెన్షియల్స్, ఫోర్ స్టెరిలైజర్స్, థర్మామీటర్స్, పీపీఈ కిట్స్, ఫేస్ షీల్స్డ్, గ్లౌజులు, షూ కవర్ డిస్పోజల్స్ ఇలా అన్ని అక్కడే దొరుకుతాయి. అయితే.. బయట దొరుకుతున్న వాటితో పోల్చితే ఇక్కడ కాస్త ధర ఎక్కువే.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ :

అమెరికా సహా పలు దేశాల్లో వర్ణ వివక్ష, జాత్యాంహకార నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఎంతోమంది బ్లాక్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అందులో భాగంగా.. ప్రత్యేక మాస్క్‌లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ బ్లాక్ మాస్క్‌లపై.. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’, ‘ఐ కాంట్ బ్రీత్’ వంటి కొటేషన్లు రాయడం గమనార్హం.

డోర్ ఓపెనర్, హ్యాండ్ టూల్స్

ఎక్కడికెళ్లినా.. డోర్ హ్యాండిల్ పట్టుకోక తప్పదు. దాన్ని తీసేందుకు డోర్ ఓపెనర్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. వీటిని ఉపయోగించి.. కార్ డోర్స్, లిఫ్ట్ బటన్స్, ఏటీఎమ్ బటన్స్‌ను ఆపరేట్ చేయొచ్చు.

Advertisement

Next Story

Most Viewed