తక్కువ ధరలో జైడస్ క్యాడిలా ఔషధం!

by Harish |   ( Updated:2020-08-13 03:50:35.0  )
తక్కువ ధరలో జైడస్ క్యాడిలా ఔషధం!
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రముఖ ఫార్మ కంపెనీ జైడస్ క్యాడిలా (Jaidus kydila) అతి చౌకైన ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గిలియడ్ సైన్సెస్ యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్ జనరిక్ వర్షన్ 100 మి.గ్రా. ఇంజక్షన్ ధరను రూ. 2,800గా నిర్ణయించి గురువారం విడుదల చేసింది. దీన్ని, రెమ్‌డాక్ బ్రాండ్ (Remdock brand) పేరున కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించే ప్రభుత్వం(Govt), ప్రైవేట్ ఆసుపత్రులకు(Private hospitals) విక్రయించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఔషధం(Medicine) విడుదలతో హెటెరో ల్యాబ్స్(Hetiro labs), సిప్లా(Cipla), జ్యూబిలెంట్ లైఫ్ సైన్సెస్, మైలాన్ ఎన్‌వీ కంపెనీల తర్వాత యాంటివైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ జనరిక్ వర్షన్‌ను భారత్‌లో విడుదల చేసిన ఐదో కంపెనీగా జైడస్ క్యాడిలా స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా, భారత్‌తో పాటు 127 దేశాల్లో రెమ్‌డెసివిర్ పంపిణీ కోసం డా.రెడ్డీస్, సిన్‌జిన్ ఇంటర్నేషనల్ కంపెనీలతో గిలియడ్ లైసెన్స్(Giliyad licence) ఒప్పందాలను కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story