- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తూర్పు సేఫ్.. పశ్చిమకే పరేషాన్..!
దిశ, ఆదిలాబాద్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కరోనా వైరస్ (కొవిడ్-19) కలవరపెడుతున్నది. లాక్ డౌన్‌కు ముందు ఉమ్మడి జిల్లాలో కొవిడ్ 19 ప్రభావం అసలే లేదు కాని తర్వాత ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి నిర్మల్ జిల్లాలో, మరొకటి ఆదిలాబాద్ జిల్లాది. అయితే, లాక్ డౌన్ తర్వాత క్రమంగా కొవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
పశ్చిమలోనే పరేషాన్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ జిల్లా పరిధిలో ఉన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొవిడ్ కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు ఇందులో ఉన్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో కొందరు గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన వారికి కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది, నిర్మల్ జిల్లాలో 10 మందికి కరోనా జబ్బు వచ్చింది. వీరందరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఇప్పటికే కరోనా వైరస్ సోకి నిర్మల్ జిల్లావాసి ఒక్కరు మృత్యువాత పడ్డారు. ఈ పరిణామాలు పశ్చిమ జిల్లా ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
తూర్పు సేఫ్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతం ఇప్పటివరకు సేఫ్ జోన్‌లో ఉన్నది. తూర్పు ప్రాంతమైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో తాజా రిపోర్టుల మేరకు ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన యువ ఇంజినీర్ ఒకరికి కరోనా లక్షణాలు కన్పించాయి. ఇటలీ వెళ్లి వచ్చిన వ్యక్తి కావడంతో అందరూ భయపడ్డారు. కాని ఆయనకు పరీక్షల్లో కొవిడ్ 19 నెగెటివని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొందరు మర్కజ్ వెళ్లి వచ్చారన్న సమాచారం ఆ జిల్లా వాసులను కలవరపెట్టింది. అక్కడి పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు 12 మంది అనుమానితులను పరీక్షలకు పంపారు. వీరందరికీ ఫలితాలు నెగిటివె వచ్చాయి. లాక్ డౌన్ తర్వాత సుమారు 16రోజులు గడుస్తుండగా..మరో వారం రోజులు దాటితే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కొవిడ్ 19కు తావుండదని అధికార వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
Tags: covid 19 alert, cases increasing, lockdown