Kovaggin Vaccine: నేటి నుంచి కొవాగ్జిన్ రెండో డోస్

by srinivas |   ( Updated:2021-05-25 23:24:23.0  )
Kovaggin Vaccine: నేటి నుంచి కొవాగ్జిన్ రెండో డోస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నేటి నుంచి కొవాగ్జిన్ రెండో డోస్ వేయనున్నారు. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ రెండు రోజుల్లో 90 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లను బట్టి జూన్ 15 తర్వాత కొవిషీల్డ్ రెండో డోస్ వేస్తామన్నారు.

ఆనందయ్య మందుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, కంట్లో వేసినప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? అనే వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు.

Advertisement

Next Story