- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు చెల్లవు
న్యూఢిల్లీ: అమెరికా విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులకు షాక్ ఇచ్చాయి. కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలను తాము పరిగణించడం లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదిత టీకాలను మళ్లీ వేసుకోవాలని ఆదేశాలిస్తున్నాయి. దీంతో భారత విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ టీకాలు వేసుకున్నాక మళ్లీ టీకాలు వేసుకుంటే ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనన్న భయాలు నెలకొన్నాయి. కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాల సామర్థ్యాలపై స్పష్టమైన వివరాలు లేవని, అందుకే మరో సెమిస్టర్ స్టార్ట్ అయ్యేలోపు తమ విద్యార్థులు డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన టీకాలను వేసుకోవాలని ఆదేశించాయి.
విద్యార్థుల ఆందోళనపై అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్, ప్రివెన్షన్ ప్రతినిధి క్రిస్టిన్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు. రెండు కొవిడ్ టీకాలు ఇంటర్‌చేంజెబుల్ కాదని, కాబట్టి, రెండు టీకాలు కలిపి తీసుకుంటే కలిగే సమర్థత, సేఫ్టీపై అధ్యయనాలు జరగలేదని అన్నారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించని టీకా వేసుకున్న విద్యార్థులు 28 రోజుల తర్వాత మళ్లీ రీవ్యాక్సినేషన్ వేసుకోవచ్చని వివరించారు.