- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందకొడిగా ఓట్ల లెక్కింపు..
దిశ ప్రతినిధి ,హైదరాబాద్ : మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల లెక్కింపు మందకొడిగా సాగుతోంది. ఈ నెల 17వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మొదలైన ఓట్ల లెక్కింపు మొదటి రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను బుధవారం ఉదయం 6.30 గంటలకు లెక్కించవలసి ఉండగా పది గంటలకు మొదలైంది. మొత్తం 799 పోలింగ్ కేంద్రాలలోని బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించి అందులోని బ్యాలెట్ పేపర్లను 8 హాల్స్ లో 56 టేబుళ్లపై లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
అయితే లెక్కింపు మొదటి రోజున 25 చొప్పున కట్టలు కట్టేందుకే రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. వెంటనే లెక్కింపు మొదలైనప్పటికీ గురువారం సాయంత్రం వరకు కేవలం రెండు రౌండ్ల ఫలితాలు మాత్రమే అధికారులు ప్రకటించారు. ఒక్కో హాల్‌లో ఏడు టేబుళ్లు, ఒక్కో టేబుల్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో లెక్కింపు నిర్వహించనుండగా ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్లు కౌంట్ చేస్తున్నారు. ఒక్కో రౌండ్‌కి దాదాపు నాలుగు గంటలు సమయం పడుతుండగా మూడు షిప్టుల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,57,354 ఓట్లు పోలైన విషయం తెలిసిందే.