గాంధీలో స్పెషల్ వార్డు.. కొత్త స్ట్రెయిన్ సోకిందా..?

by Anukaran |
గాంధీలో స్పెషల్ వార్డు.. కొత్త స్ట్రెయిన్ సోకిందా..?
X

దిశ,తెలంగాణ బ్యూరో: తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు వేగవంతం చేసింది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల కరోనాతో ఆసుపత్రులలో చేరినవారికి కొత్త స్ట్రెయిన్ సోకిట్టుగా అనుమానిస్తున్నారు. గడిచిన 24 గంటలలో 157 కేసులు మాత్రమే నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మూడు నాలుగింతలు అధికంగా ఉన్నాయని తెలిసింది. గాంధీ ఆసుపత్రికి క్రమేనా కరోనా రోగుల తాకిడి పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

విడతలవారీగా ప్రజలకు కరోనా టీకా అందుతుందని, ఇకపై కరోనా బెడద ఉండదని అనుకుంటున్న తరుణంలో కొత్త రకం స్ట్రెయిన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. టీకా దానికి కూడా పని చేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో భయం పోవడం లేదు. ప్రభుత్వం ముందస్థు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోందని అంటున్నారు. పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

గాందీ ఆస్పత్రికి పరుగులు

పాజిటివ్ నిర్థారణ కాగానే బాధితులు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. 90 శాతం మంది రోగులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. చాలా మందిని వెంటిలేటర్లపై ఉంచినట్టు తెలిసింది. గడిచిన 24 గంటలలో 157 కేసులు మాత్రమే నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 35, మేడ్చల్ జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 1,983 కాగా, హోం ఐసోలేషన్ లో 718 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.79 శాతం ఉండగా, మరణాల రేటు ఒక శాతంగా ఉంది. ఇప్పటివరకు ప్రతి పది లక్షల జనాభాలో 2,48,226 మందికి పరీక్షలు చేశారు. మహారాష్ట్ర, కర్నాటక పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ చేపట్టకపోతే ప్రమాదం ముంచుకొస్తుందనే చెప్పాలి.

Advertisement

Next Story