భారత్‌లో 3,23,144 కరోనా కేసులు

by Shamantha N |
india corona sticker
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 3,52,991 పోలిస్తే 8.4 శాతం తక్కువగా కేసులు నమోదు కావడం కొంత ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 2771 మంది మరణించారు. ఇది నిన్నటి మరణాల సంఖ్య 2812 కన్నా తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. ఇక మొత్తం మరణాల సంఖ్య 2లక్షలకు దగ్గరగా ఉంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,97,894కు చేరింది. తాజాగా 2,51,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,45,56,209గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు

Advertisement

Next Story