- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ చుట్టూ కరోనా వైరస్!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి దెబ్బకు దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. తొలిసారి ఇన్ని రోజులు వ్యాపారం లేక రాబడి నిలిచిపోవడంతో అనేక వ్యాపారాలు ఆందోళనలో పడ్డాయి. ప్రధానంగా ఈ శతాబ్దపు సంచలనమైన స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు కోవిడ్-19 గాయాలు ఇప్పట్లో మానేలా లేవు. ఈ 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా దేశీయ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలకు సుమారు రూ. 1500 కోట్ల నష్టం తప్పదని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనాలను వెల్లడించింది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో విక్రయాలు పూర్తీగా నిలిచిపోయాయి. ఈ రెండు నెలల్లో ఏర్పడ్డ నష్టమే అత్యధికమని సంస్థ పేర్కొంది. లాక్‌డౌన్ వల్ల గతేడాది మార్చిలో జరిగిన స్మార్ట్‌ఫోన్‌ల విక్రయం 15.8 కోట్ల కంటే, ఈ నెల మార్చి రెండవ వారం నుంచి చివరి నాటికి రూ. 15.3 కోట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఏప్రిల్ 14 వరకూ లాక్‌డౌన్ ఉండటం వల్ల మొత్తం విక్రయాల్లో సుమారు 60 శాతం తగ్గుదల ఉండే అవకాశముందని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ పేర్కొన్నారు.
ప్రధానంగా చైనాలో విడి భాగాల ఉత్పత్తి నిలిచిపోవడంతో,సరఫరా ఆగిపోయింది. ఈ పరిణామాలతో ఈ ఏడాది తొలి త్రైమాసికం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు దారుణంగా దెబ్బతింటాయి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరిగి లాక్‌డౌన్ కొనసాగితే ఈ నష్టాలను ఊహించలేమని ఆయన తెలిపారు. పూర్తీగా సరఫరా వ్యవస్థా, ఆదాయం, చెల్లింపులు లేకపోతే పరిశ్రమకు తీవ్ర నష్టాలు తప్పవు. దీనికి తోడు, కోవిడ్-19 కారణంగా వినియోగదారులు పొదుపు మంత్రాన్ని పాటిస్తారు. దీంతో కొనుగోళ్లు మళ్లీ పెరగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటం వల్ల ఇండియా నుంచి ఎగుమతి చేసే పరిశ్రమలపై ఈ ప్రభావం అధికంగా ఉండోచ్చు. అయితే, ఈ నష్టాన్ని తగ్గించేందుకు లాక్‌డౌన్ ఎత్తేశాక ఉత్పత్తిని ఒకేసారి అత్యధికంగా పెంచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కరలేదు.
కోవిడ్-19 ప్రభావాం తగ్గి మళ్లీ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు మునుపటి డిమాండ్ పెరగాలంటే రెండో త్రైమాసికం తర్వాత వచ్చే పండుగ సీజన్ల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. పండుగ సీజన్ వరకూ కస్టమర్లు ఎలాంటి కొనుగోళ్లు చేయరు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక కూడా నేరుగా జరిగే కొనుగోళ్ల కంటే ఆన్‌లైన్ విక్రయాలు పెరుగుతాయి. కాబట్టి స్టోర్ల వద్ద జరిగే విక్రయాల కంటే ఆన్‌లైన్ విక్రయాలకు అవసరమైన స్టాక్‌ను అందించాల్సిన బాధ్యతను స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు నెరవేర్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.
Tags: covid-19, coronavirus impact, smartphone industry