- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా దెబ్బకు 'సినీ' కష్టాలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా… మనుషులను కాల్చుకుతింటోంది. ప్రపంచ మానవాళిని వణికిస్తోంది. ఎదుటి మనిషి నీడను తాగేందుకు కూడా భయపడేలా చేస్తోంది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసిన కరోనా… ఇంటిపట్టున ఉంచి చేతులు, కాళ్లను రిలాక్స్ చేసినా… మైండ్‌ను మాత్రం టెన్షన్ పెడుతుంది. ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఎటు నుంచి వస్తుందో తెలియని కరోనా… నీడపట్టునే ఉన్న మనుషులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కరోనా తీవ్రత పెరుగుతుండగా… బంద్ కారణంగా మరింత ఒత్తిడికి గురవుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే ఫిల్మ్ నగర్ కష్టాలు కూడా పెరిగిపోయాయ్.
ప్రధానంగా సినిమా రంగంపై కరోనా ప్రభావం భారీగా పడింది. సినిమా థియేటర్లు, మాల్స్ మూతపడి భారీగా నష్టాలను చవిచూసేలా చేసింది. సినిమా రిలీజ‌్‌లు, షూటింగ్‌లు వాయిదా పడేలా చేసి మరింత కష్టాల ఊబిలోకి నెట్టేసింది. తద్వారా పనులు లేక సినీ కార్మికులు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నెల 31 వరకు అన్ని సినిమా షూటింగ్‌లు వాయిదా పడితేనే ఇంత ఇబ్బందిగా ఉంటే… ఒకవేళ పొడిగిస్తే మా గతేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీకార్మికులు. రోజువారి వేతనాలపై ఆధారపడి బతికే మేము… కరోనా ఎఫెక్ట్‌తో ఆ వ్యాధి సంక్రమించకుండానే చనిపోతామనే భయం వేస్తోందన్నారు.
కరోనా ప్రభావంతో ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకొచ్చినా.. సర్కార్ అందిస్తున్న పథకాలకు అర్హులైన సినీ కార్మికులు చాలా తక్కువ మంది ఉన్నారు అనేది కృష్ణానగర్ మాట. దీంతో ఈ పరిస్థితుల్లో తమను గుర్తించి సాయం చేయాలని వేడుకుంటున్నారు. కరోనాతో కష్టాలపాలైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags : CoronaVirus, Covid 19, Cine Industry, TFI