డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-08-03 04:51:04.0  )
డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ దర్శకుడు తేజకు కరోనా మహమ్మారి సోకింది. లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. తనతో కాంటాక్ట్ అయినవారు టెస్టులు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఇద్దరు డైరెక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఐదురోజుల క్రితం దర్శకధీరుడు రాజమౌళికి కరోనా సోకగా ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Advertisement

Next Story