- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టెస్టుకు పోలేదు.. ఫోన్‌కు నెగెటివ్ రిపోర్ట్ మేసేజ్.. ఖంగుతిన్న గ్రామస్తులు

X
దిశ ప్రతినిధి, వరంగల్ : కరోనా నిర్ధారణ పరీక్షలకు వెళ్లకున్నా.. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకున్నట్లుగా బుచ్చమ్మ అనే మహిళకు నెగెటివ్ ఉన్నట్టు టెక్ట్స్ మెసేజ్ రావడంతో సమీప బంధువు ఖంగుతింది. ఈ షాకింగ్ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కనీసం ఆసుపత్రి వైపు కూడా తాము వెళ్లలేదని, అయినా ఆసుపత్రి నుంచి పేర్లు, ఇతర వివరాలతో సహా రావడంపై బుచ్చమ్మ బంధువు కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.
ఇదే పీహెచ్‌సీ సెంటర్ నుంచి ఇటీవల పది మంది వరకు కూడా ఇలాగే మెసేజ్‌లు వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఇలా తప్పుడు సమాచారం వెళ్తుండటంపైన పలు అనుమానాలు కలుగుతున్నాయి.
- Tags
- corona test
Next Story