ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా

by Shyam |   ( Updated:2021-02-23 23:53:52.0  )
ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్ తేలింది. ప్రస్తుతం వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం దంపతులిద్దరు కరోనా పరీక్షలు చేసుకోగా వారికి పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఇటీవల తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు.

Advertisement

Next Story