ఎమ్మెల్యే గన్‎మెన్, డ్రైవర్‎లకు కరోనా

by vinod kumar |
ఎమ్మెల్యే గన్‎మెన్, డ్రైవర్‎లకు కరోనా
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గన్‌మెన్, డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు. నిజామాబాద్‌‌ జిల్లాలో శుక్రవారం నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో ఇద్దరు ఎమ్మెల్యే బాజిరెడ్డితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న గన్‌మెన్, డ్రైవర్లు అని తేలింది. బాజిరెడ్డికి కరోనా సోకడంతో మొత్తం 80 మందిని ప్రైమరీ కాంటాక్ట్‌గా అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటికే ఆయన సతీమణి, వంటమనిషికి వైరస్ సోకిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story