- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐదుగురు ఎమ్మెల్యేలు, 61 మంది అసెంబ్లీ స్టాఫ్‌కు కరోనా
by vinod kumar |
X
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు, 61 మంది అసెంబ్లీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ తెలిపారు. సోమవారం(ఈ నెల 28) నుంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నందున ముందస్తుగా అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 మంది ఎమ్మెల్యేల టెస్టు రిపోర్టులు వచ్చాయని, మిగతా చట్టసభ్యుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యేలు, సిబ్బందిని సమావేశాలకు అనుమతించబోమని చెప్పారు. సదరు చట్టసభ్యులు ఆన్‌లైన్‌లో సమావేశాలకు హాజరవ్వచ్చునని తెలిపారు. 230 మంది చట్టసభ్యులు కూర్చునే సామర్థ్యమున్న సభను భౌతిక దూరం పాటిస్తూ కేవలం 105 మంది ఎమ్మెల్యేలకే కేటాయించనున్నట్టు చెప్పారు.
Advertisement
Next Story