- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా
by vinod kumar |

X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజగా, దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురలో ఉంటున్న ఒకే కుటుంబంలోని 26 మందికి కరోనా సోకడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ కుటుంబం ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించారు. ఈ జోన్‌తో కలిపి ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 76కు చేరింది.
Tags: Corona, positive, 26 people, same family, delhi, Containment zone
Next Story