- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాజిటివ్‌లు పెరుగుతున్నాయ్.. డిశ్చార్జిలు అంతంతే !
– 18 వేలకు చేరువవుతున్న కేసులు
– లక్షణాలు లేకుండా పాజిటివ్ నిర్ధారణపై ఆందోళన
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి సమయం తగ్గుతోందంటూ కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఓ వైపు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. మరో వైపు కొత్త కేసులు మాత్రం గణనీయంగా పుట్టుకొస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 1700 కొత్త కేసులు పుట్టుకు రాగా.. ఇప్పటివరకు ఇంత ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివ్ కేసులు గరిష్టంగా నమోదవుతుండగా డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య మాత్రం స్వల్పంగానే ఉంది. ఒక్క రోజు వ్యవధిలో సగటున 1500 కొత్త కేసులు పుట్టుకొస్తుంటే, రికవరీ అవుతున్నవారు మాత్రం వందల సంఖ్యల్లోనే ఉంటున్నారు. మరోవైపు మృతులు కూడా పెరుగుతున్నారు. దీనికి తోడు వైద్య సిబ్బందిలో ప్రతీరోజూ పదుల సంఖ్యలో ఇన్‌ఫెక్షన్ బారిన పడి పాజిటివ్ పేషెంట్లుగా మారుతున్నారు. మరోవైపు అత్యవసర సేవల్లో ఉన్న పోలీసులు, జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు. పంజాబ్‌లో ఒక అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కరోనా కారణంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక డాక్టర్ చనిపోయారు. తాజాగా మహారాష్ట్రలో 51 మంది పాత్రికేయులు, తమిళనాడులో ముగ్గురు పాత్రికేయులు కరోనా పాజిటివ్ పేషెంట్లయ్యారు.
కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సోమవారం సాయంత్రం 5 గంటలకు బులెటిన్ విడుదల చేసే సమయానికి దేశవ్యాప్తంగా మొత్తం 17,656 పాజిటివ్ కేసులున్నాయి. కానీ రెండు గంటల వ్యవధిలోనే కొత్తగా దాదాపు 150 కేసులు రావడంతో మొత్తం సంఖ్య 17,795కు (రాత్రి 9 గం.) చేరుకుంది. ఇది 18 వేల మార్కుకు దగ్గరవుతోంది. గతంలో నాలుగు రోజులకు కేసుల సంఖ్య రెట్టింపవ్వగా, ఇప్పుడు ఏడున్నర రోజులు పడుతోందని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కానీ జాతీయ స్థాయిలో సగటు ఆ తీరులో ఉన్నప్పటికీ ఎక్కువ కేసులు ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి చోట్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 466 కేసులు నమోదయ్యాయి. ఇందులో 308 ముంబయి నగరంలోనే ఉండటం గమనార్హం. దేశం మొత్తంమీద మృతుల సంఖ్య 559కి చేరుకోగా.. ఒక్క రోజులోనే 47 మంది మృతిచెందారు. ఒక్క మహారాష్ట్రలోనే మొత్తం 232 మరణాలు నమోదవగా, ముంబయి నగరంలోనే గరిష్టంగా 139కి చేరుకుంది.
ఇదిలా ఉండగా, గత ఒకటిన్నర నెల రోజులుగా నమోదవుతున్న కేసులను విశ్లేషించిన ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు కేసులు పెరగడంపైనే కాక వాటి స్వభావంపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైరస్ బయటపడడానికి గరిష్టంగా 14 రోజుల సమయం పడుతుందని అంచనా వేయగా, ఇప్పుడు 28 రోజులు దాటిన తర్వాత కూడా వెలుగులోకి వస్తున్నాయని, దీనికి అనుగుణంగా ప్రోటోకాల్ మార్చాల్సి ఉంటుందని కొద్దిమంది అభిప్రాయపడ్డారు. మరో కారణమేమంటే, ఎలాంటి లక్షణాలు లేకుండానే పరీక్షల్లో పాజిటివ్ వస్తోందని, గతంలో నిర్ధేశించిన ప్రోటోకాల్‌కు భిన్నంగా ఉన్నందున దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ గంగా ఖేడ్కర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెరగడాన్ని మరో కోణం నుంచి ఆలోచించి అర్థం చేసుకోవచ్చుగానీ, లక్షణాలు లేకుండానే పాజిటివ్ రావడం అనేది ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. లక్షణాలు బయటపడకపోతే ఎంతమందికి పరీక్షలు చేసి నిర్ధారించుకోగలమని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరికీ పరీక్షలు చేసి పాజిటివ్ ఉందా లేదా అని తేల్చలేమని, లక్షణాలు లేకుండానే పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు రావడం.. చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశమన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో చనిపోతున్నవారు కేవలం రెండు శాతం కంటే తక్కువ ఉన్నారని, కానీ పంజాబ్‌లో ఇది 7.3%, మహారాష్ట్రలో 5.3% చొప్పున ఉన్నాయి. గుజరాత్‌లో సైతం ఇది ఎక్కువగానే ఉంది.
భారత్ :
మొత్తం కేసులు : 17,795
మృతులు : 559
రికవరీ : 2842
తెలంగాణ :
మొత్తం కేసులు : 872
మృతులు : 23
రికవరీ : 186
ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 722
మృతులు : 20
రికవరీ : 92
Tags: Corona, India, Positive, Death, Maharashtra, Mumbai, Journalist, Police