ఏపీలో 3లక్షల 53వేలు దాటిన కరోనా కేసులు

by Anukaran |   ( Updated:2020-08-23 06:50:46.0  )
ఏపీలో 3లక్షల 53వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 46,712 మందికి పరీక్షలు నిర్వహించగా 7,895 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,282కి చేరింది. ప్రస్తుతం 89,742 యాక్టివ్ కేసులు ఉండగా 2,60,087 మంది బాధితులు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 7,449 మంది కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి నెల్లూరు జిల్లాలో 16మంది ప్రాణాలు కోల్పోగా పశ్చిమగోదావరి జిల్లాలో 13మంది, చిత్తూరులో 11మంది, కర్నూలులో 10మంది, ప్రకాశంలో 9మంది, కడపలో 8మంది, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విజయనగరంలో జిల్లాలో ఇద్దరు మరణించారు.

అనంతపురం జిల్లాలో 466 పాజిటివ్ కేసులు నమోదుకాగా, చిత్తూరులో 934, తూర్పుగోదావరిలో 1256, గుంటూరులో 507, కడపలో 448, కృష్ణా 142, కర్నూలు 685, నెల్లూరు 985, ప్రకాశం 923, శ్రీకాకుళం 227, విశాఖపట్నం 451, విజయనగరం 200, పశ్చిమగోదావరిలో 671 మంది కరోనా వైరస్ బారిన పడిటనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Advertisement

Next Story