వేధింపులు తట్టుకోలేక కరోనా రోగి ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2020-08-03 10:30:10.0  )
వేధింపులు తట్టుకోలేక కరోనా రోగి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా రోగికి దైర్యం చెప్పాల్సింది పోయి.. సూటిపోటి మాటాలతో వేధించారు గ్రామస్తులు. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తికి కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. వెంటనే యాదగిరి తన ఇంటికి వచ్చాడు. దీంతో గ్రామంలో అతని వల్ల కరోనా విస్తరిస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అతన్ని మానసికంగా వేధించారు. దీంతో యాదగిరి తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed