- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంట పొలాల్లో దాకున్న కరోనా రోగి
దిశ, పాలేరు: మద్దులపల్లి క్వారంటైన్ సెంటర్ నుంచి పరారైన కరోనా రోగిని ఎట్టకేలకు పట్టుకున్నారు. చింతకాని మండలం నాగులవంచకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మూడు రోజుల క్రితం మద్దులపల్లి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే అక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేవని.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సదరు బాధితుడు అదే రోజు సాయంత్రం పరారయ్యాడు.
సీసీ ఫుటేజీ ఆధారంగా రోగి పారిపోయిన విషయాన్ని గుర్తించిన అధికారులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా పొలంలో తిండి తిప్పల్లేకుండా, ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పడిగాపులు పడ్డాడు. ఈ విషయాన్ని అటుగా వెళ్లిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వైద్యులతో సహా అక్కడికి చేరుకుని రోగికి అవగాహన కల్పించి అంబులెన్స్‌లో మద్దులపల్లి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.