ఆక్సిజన్ అందక కరోనా షేషెంట్ మృతి

by Shyam |
ఆక్సిజన్ అందక కరోనా షేషెంట్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకిన రోగుల పట్ల వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో జనాల ప్రాణాలు పోతున్నాయి. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలోని కొవిడ్-19 వార్డులో ఆక్సిజన్ అందక ఓ యువకుడు మరణించాడు. వివరాల్లోకెళితే.. మాడుగులపల్లి మండలం సల్కునూర్ ప్రాంతానికి చెందిన కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చేరాడు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో సాయంత్రం 6గంటలకు ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు.

అయితే, బాధితుని నుంచి మొదట శాంపిల్స్ తీసుకుని సిబ్బంది కోవిడ్-19 టెస్ట్‌కు పంపించారు. అతను వచ్చిన సమయంలో ఆస్పత్రిలో ఒక్క డాక్టర్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఆక్సిజన్ అందక పోవడంతోనే అతను హాస్పిటల్ బెడ్ పైనే ప్రాణాలు వదిలాడని తెలుస్తోంది. ఆ సమయంలో కొడుకును బతికించుకోవాలని తల్లి పడిన ఆవేదన మాటల్లో చెప్పలేనిది. ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగుల పట్ల వైద్యుల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story