- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనాకు చికిత్స తీసుకుంటున్న పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఒంగోలు రిమ్స్ పై నుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం. కరోనా పాజిటివ్ రావడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో గత కొద్ది రోజుల నుంచి అతను చికిత్స పొందుతున్నాడు.
కాగా, ఇలా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కరోనా పేషెంట్ల ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ కారణం వారిని సామాజిక దృక్పథంతో చూడడంలేదని, అంటరాని వారిగా చూస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులు కూడా తమపై కనికరం చూపడంలేదని ఈ మూలంగా తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జనాల్లో మార్పు రావాలని, కరోనా పేషెంట్లకు మనో ధైర్యం నింపేలా చేయాలి కానీ, ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారిని చూడొద్దని ప్రముఖులు, నిపుణులు సూచిస్తున్నారు.